Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి: ఎస్సై విద్యచరణ్ రెడ్డి

Updated : 24 Jun 2026 16:49 IST
As Preferred Source 1 min read
చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి: ఎస్సై విద్యచరణ్ రెడ్డి

పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా జూనియర్ కళాశాలలో పటాన్చెరు పోలీసుల ఆధ్వర్యంలో “డ్రగ్స్ వద్దు – జీవితానికి అవును” అనే అంశంపై మెగా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై విద్యచరణ్ రెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబాలు మరియు సమాజంపై పడే దుష్ప్రభావాల గురించి వివరించారు. డ్రగ్స్ అలవాటు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్యార్థి దశలోనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ సేవించడం, విక్రయించడం లేదా రవాణా చేయడం వంటి చర్యలకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 1908 నంబర్లకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పటాన్చెరు పోలీసులు విద్యార్థులతో "డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాం" అంటూ ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్సై విద్యచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Sthanikam

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి: ఎస్సై విద్యచరణ్ రెడ్డి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news