Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

డిజిటల్ విద్యాభివృద్ధికి చేయూత.. ఖేడ్ జడ్పీహెచ్ఎస్‌కు 10 ల్యాప్‌టాప్‌లు అందజేత

Updated : 24 Jun 2026 16:49 IST
As Preferred Source 1 min read
డిజిటల్ విద్యాభివృద్ధికి చేయూత.. ఖేడ్ జడ్పీహెచ్ఎస్‌కు 10 ల్యాప్‌టాప్‌లు అందజేత

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన అంనెట్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ సంస్థ నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లను అందజేసింది. సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ల్యాప్‌టాప్‌లను ప్రధానోపాధ్యాయుడు మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్యలకు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్న ఖేడ్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడు చంద్రశేఖర్ ఆచార్య విజ్ఞప్తి మేరకు ఈ సహాయం అందించామని, విద్యార్థులు ల్యాప్‌టాప్‌లను సద్వినియోగం చేసుకుని సాంకేతిక విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అంనెట్ డిజిటల్ సంస్థ సీఈవో కృష్ణారెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి సూర్యదేవర, హర్షిత్ సక్సేనా, అభిలాష్, మల్లేశ్వరి, లయన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు, అరుణ, మాధవి సూర్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Sthanikam

డిజిటల్ విద్యాభివృద్ధికి చేయూత.. ఖేడ్ జడ్పీహెచ్ఎస్‌కు 10 ల్యాప్‌టాప్‌లు అందజేత

Article Image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన అంనెట్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ సంస్థ నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లను అందజేసింది. సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ల్యాప్‌టాప్‌లను ప్రధానోపాధ్యాయుడు మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్యలకు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్న ఖేడ్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడు చంద్రశేఖర్ ఆచార్య విజ్ఞప్తి మేరకు ఈ సహాయం అందించామని, విద్యార్థులు ల్యాప్‌టాప్‌లను సద్వినియోగం చేసుకుని సాంకేతిక విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అంనెట్ డిజిటల్ సంస్థ సీఈవో కృష్ణారెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి సూర్యదేవర, హర్షిత్ సక్సేనా, అభిలాష్, మల్లేశ్వరి, లయన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు, అరుణ, మాధవి సూర్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news