Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:24 PM

రైతుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే మందుల సామేల్.

24-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుంగతుర్తి,

రైతుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. అడ్డగూడూరు మండలం రేపాక గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణలో భాగంగా 10 మంది రైతులకు ఎకరానికి రూ.12 లక్షల చొప్పున పరిహార చెక్కులను బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రైతులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రేపాక గ్రామ రైతుల భూములకు సంబంధించిన పరిహారం విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు.

గతంలో నిర్ణయించిన రేటు ప్రకారం ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే పరిహారం అందే అవకాశం ఉండేదని చెప్పారు. అయితే దశాబ్దాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిన రూ.6 లక్షలకు అదనంగా మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలు అందించాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి అంగీకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రైతులతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసిన రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్, రైతులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ ఎ. శేషగిరిరావు, డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు, నగేష్‌కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే మందుల సామేల్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News