Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

24-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామ పరిధిలో గల రాంసింగ్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్‌రావు పాటిల్, సంజీవ్ పాటిల్, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ స్వామి, స్వామిదాస్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తండా వాసులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామ పరిధిలో గల రాంసింగ్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్‌రావు పాటిల్, సంజీవ్ పాటిల్, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ స్వామి, స్వామిదాస్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తండా వాసులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News