Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:18 AM

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం

24-06-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ, 2వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్, 1వ వార్డు కౌన్సిలర్ నర్సమ్మ (రవి), 2వ వార్డు కౌన్సిలర్ సుధీర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది కలిసి పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువలు, వీధి దీపాలు, రహదారులు తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రజలకు వివరించి, అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News