Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:25 PM

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
24-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, : భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు రూపొందించి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎం పోరాటాల ఫలితంగా అధికారులు ఇటీవల సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమి, 18 ఎకరాలు పట్టా భూమి కలిపి మొత్తం 38 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. భూమిని అభివృద్ధి చేసి పేదలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక పేదలు అద్దె భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 700 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని వెంటనే చదును చేసి ప్లాట్లు కేటాయించాలని, లేనిపక్షంలో గుడిసెవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, నాయకులు కొత్త లక్ష్మయ్య, దొడ్డి శంకర్, పిట్టల చంద్రశేఖర్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News