Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:47 AM

ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

24-06-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట–అమ్మనబోలు రూట్లో ఆర్టీసీ బస్సును తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ఈ రూట్లో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రామన్నపేట–అమ్మనబోలు రూట్ పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నప్పటికీ, మండల కేంద్రానికి సరైన రవాణా సౌకర్యం లేక విద్యాభ్యాసానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రతిరోజూ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో ఒక్కో విద్యార్థి రోజుకు సుమారు రూ.100 వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని, ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు పిట్టల నవీన్, అప్పం అభిరూప్, బూడిద యశ్వంత్, ముక్కిడి ప్రవీణ్, తుర్కపల్లి లోకేష్, అభినవ్, శ్రావ్య, అనుప్రియ, హారిక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News