Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ

08-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 8: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో బుధవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసిన సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని చెట్లుగా పెంచే బాధ్యతను కూడా ప్రతి కుటుంబం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని, గ్రామాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుంజి రాజు, వార్డు సభ్యులు సాపిడి అనిత అశోక్, గ్రామ పెద్దలు లడే రాములు, బేబిరి సోమయ్య, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News