Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

పవన్ అభిమానిని మృత్యువు కబళించింది.. నిరంజన్ కన్నుమూత

08-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హనుమకొండ, జూలై 8: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషాద వార్త స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిన నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే చికిత్స కొనసాగుతున్న సమయంలో నిరంజన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిరంజన్ మృతి పట్ల స్థానిక ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

"అభిమాని కోసం ఇంటికెళ్లిన పవన్.. చివరకు విషాదాంతం.. నిరంజన్ మృతితో విషాదంలో అభిమానులు" అంటూ పలువురు నివాళులర్పిస్తున్నారు.

Sthanikam

పవన్ అభిమానిని మృత్యువు కబళించింది.. నిరంజన్ కన్నుమూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News