Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

అర్ధరాత్రి దాహం... వీసీ గెస్ట్ హౌస్ ముట్టడించిన విద్యార్థినులు

08-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నీటి కోసం నిద్ర మానేసి రోడ్డెక్కిన ఎంజీయూ బాలికలు.. యాజమాన్యంపై ఆగ్రహం

నల్లగొండ, జూలై 8:

తాగునీటి కోసం అర్ధరాత్రి బాలికల హాస్టల్ విద్యార్థినులు వీధిన పడిన ఘటన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో తాగునీరు, వినియోగ నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో విద్యార్థినులు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హాస్టల్ నుంచి బయటకు వచ్చి వీసీ గెస్ట్ హౌస్ ఎదుట ఆకస్మికంగా ఆందోళనకు దిగారు.

హాస్టల్‌కు సరఫరా కావాల్సిన నీటిని కొత్త భవనాలకు మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థినులు ఆరోపించారు. రోజుల తరబడి నీటి సమస్య వేధిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీరు లేక, నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.

మెస్ నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉందని, పలుమార్లు వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతోనే అర్ధరాత్రి నిరసన చేపట్టాల్సి వచ్చిందని విద్యార్థినులు తెలిపారు. కేర్‌టేకర్లు, వార్డెన్ల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని మండిపడ్డారు.

అర్ధరాత్రి సమయంలో బాలికలు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం విశ్వవిద్యాలయ యాజమాన్య వైఫల్యానికి నిదర్శనమని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.నీటి సమస్యపై గతంలో కూడా విద్యార్థులు ప్రశ్నించగా కేసులు నమోదు చేసినట్లు సమాచారం ఉందని, సమస్యలను పరిష్కరించాల్సిన యాజమాన్యం ప్రశ్నించే వారిపైనే చర్యలకు దిగడం దురదృష్టకరమని విద్యార్థులు పేర్కొన్నారు.

వెంటనే ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి సమస్యకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు."హాస్టల్‌లో నీళ్లు లేవు... అర్ధరాత్రి నిరసన తప్ప మాకు మరో మార్గం కనిపించలేదు" అంటూ విద్యార్థినులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

అర్ధరాత్రి దాహం... వీసీ గెస్ట్ హౌస్ ముట్టడించిన విద్యార్థినులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News