Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

అర్వపల్లిలో కాంగ్రెస్ వర్గపోరు రగిలింది..!

08-07-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎమ్మెల్యే సామేలు వర్గం–ఎంపీ చామల, దామోదర్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్‌తో ఉద్రిక్తత

అర్వపల్లి, జూలై 8: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల నియామకాల వ్యవహారం చిచ్చు రేపడంతో ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మరియు మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.పార్టీ మండల అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యే సామేలు ఏకపక్ష ధోరణి అవలంబించారని ఆరోపిస్తూ పలువురు పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ అభ్యంతరాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీ చామల, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి వర్గీయులు గాంధీభవన్‌కు బయలుదేరినట్లు సమాచారం.అయితే అర్వపల్లి మండల కేంద్రంలో వీరు ప్రయాణిస్తున్న బులెరో వాహనాన్ని ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు అడ్డుకుని రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా, పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసు సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అర్వపల్లి మండల కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటనతో తుంగతుర్తి కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగ ఘర్షణలకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Sthanikam

అర్వపల్లిలో కాంగ్రెస్ వర్గపోరు రగిలింది..!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News