Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం.. నేర నియంత్రణపై డీఐజీ జోయెల్ డేవిస్ దిశానిర్దేశం

13-07-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నేరాల నియంత్రణలో ముందస్తు చర్యలు, శాస్త్రీయ దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలే విజయానికి ప్రధాన ఆధారమని యాదాద్రి జోన్-వి డీఐజీ డి. జోయెల్ డేవిస్అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా నేర సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన ఆయన, ప్రతి పోలీసు అధికారి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.

సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న వివిధ రకాల నేరాలు, వాటి నియంత్రణకు చేపడుతున్న చర్యలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిర్వహణ, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, మాదకద్రవ్యాల కేసుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలంటే శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. సాక్ష్యాధారాల సేకరణ నుంచి ఛార్జిషీట్ దాఖలు వరకు ప్రతి దశలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

నేరాలను అరికట్టడంలో ముందస్తు నిఘా, సమాచార సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కీలక పాత్ర పోషిస్తాయని డీఐజీ పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని చెప్పారు. అదే విధంగా గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నివారణ చర్యలు మరింత బలోపేతం చేయాలని సూచించారు.

కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని డీఐజీ జోయెల్ డేవిస్ సూచించారు. ప్రజలతో పోలీసుల అనుబంధం పెరగడం ద్వారా నేరాల నివారణ మరింత సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాత్రి వేళల్లో నైట్ పెట్రోలింగ్‌ను పటిష్టంగా నిర్వహించడంతో పాటు నాకాబందీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, నేరచరిత్ర కలిగిన వారిపై నిఘా కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను ముందుగానే అడ్డుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రజా భద్రతకు సంబంధించి చేపడుతున్న చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో అమలు చేస్తున్న పోలీసింగ్ విధానాలు, నేరాల నియంత్రణలో సాధించిన ఫలితాలను డీఐజీకి వివరించారు.

జిల్లా పోలీసు శాఖ పనితీరు ప్రశంసనీయంగా ఉందని డీఐజీ జోయెల్ డేవిస్ అభినందించారు. ఇదే అంకితభావం, క్రమశిక్షణతో ప్రజలకు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించాలని అధికారులకు సూచించారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, డీటీసీ డీఎస్పీ నగేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాలో నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

Sthanikam

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం.. నేర నియంత్రణపై డీఐజీ జోయెల్ డేవిస్ దిశానిర్దేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News