Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:16 AM

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

13-07-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా పెన్‌పహాడ్ మండలం తంగేళ్లగూడెంకు చెందిన దేశగాని రామకృష్ణ, అబ్బగాని వెంకటయ్య, దోసపహాడ్ గ్రామానికి చెందిన కడవంచి వెంకటమ్మలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, తంగేళ్లగూడెం సర్పంచ్ పందుల వెంకటేశ్వర్లు, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు సంకరమద్ది సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News