Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:24 AM

ఆరుద్ర నక్షత్రం, మాసశివరాత్రి వేళ పిల్లలమర్రి శివాలయంలో విశేష పూజలు

13-07-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిల్లలమర్రి లో రెండు శివాలయాలు ఘనంగా పూజలు.

తెల్లవారుజామునే భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

ఆరుద్ర నక్షత్రం, సోమవారం మరియు మాసశివరాత్రి ఒకే రోజు రావడంతో సూర్యాపేట మండలంలోని చారిత్రాత్మక పిల్లలమర్రి శివాలయంలో సోమవారం అత్యంత వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు తెల్లవారుజామునే విశేష అభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో పంచామృతాభిషేకం, అనంతరం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ చేసి, సుగంధ పుష్పాలతో పుష్పార్చన, పవిత్ర బిల్వదళాలతో బిల్వార్చన, దీపనీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాసశివరాత్రి రోజున పరమేశ్వరుని దర్శించుకోవడం, రుద్రాభిషేకం నిర్వహించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు.

Sthanikam

ఆరుద్ర నక్షత్రం, మాసశివరాత్రి వేళ పిల్లలమర్రి శివాలయంలో విశేష పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News