Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:21 AM

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ, అండర్‌పాస్‌లు నిర్మించాలి

13-07-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కలెక్టర్‌కు సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ వినతిపత్రం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించడంతో పాటు రెండు అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత సూర్యాపేట పట్టణం అన్ని దిశల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ జనాభా పెరుగుతోందన్నారు. అయితే ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని పేర్కొన్నారు.

కుడకుడ రోడ్, ఖమ్మం రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం నుంచి చివ్వెంల హైవే వరకు, ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం నుంచి కుసుమవారిగూడెం వరకు నాలుగు లేన్లుగా రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయే బాధితులకు మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం రోడ్డును 60 అడుగుల రోడ్డుతో అనుసంధానించేలా అండర్‌పాస్ నిర్మించాలని, హైటెక్ బస్టాండ్ సమీపంలో మరో అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైటెక్ బస్టాండ్ నుంచి బస్సులు రాంగ్‌రూట్‌లో రావడం, హైవే వద్ద యూ-టర్న్‌లు తీసుకోవడం వల్ల తరచూ ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.

జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కేంద్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతిపాదిత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ, అండర్‌పాస్‌లు నిర్మించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News