Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

దళితులపై కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

14-07-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సామాజిక అణచివేతపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం

​ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్

దేశంలో నేటికీ దళితులపై కుల వివక్ష, సామాజిక అణచివేత, దాడులు కొనసాగుతుండడం అత్యంత ఆందోళనకరమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.​మంగళవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు భూహక్కులు, ఉపాధి, గృహాలు, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల విషయంలో ఇప్పటికీ తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, బాధితులకు తక్షణ న్యాయం అందించాలి.​దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గతంలో వారికి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వాలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు యాట బాలరాజు, కార్యదర్శి చింతల సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య, మానే సాలయ్య, మండల నాయకులు యాట ముత్యాలు, పొట్ట వెంకటయ్య, నేరేడు మహేష్, జంగం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళితులపై కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News