Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్‌చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ

14-07-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పైప్‌లైన్ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న సాయి చైతన్య సంక్షేమ వృద్ధాశ్రయానికి ఆర్థిక సాయం అందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రయానికి ఐదు వీల్‌చైర్లు, పది బెడ్‌షీట్లు, పది బెడ్లు, నాలుగు బీపీ–షుగర్ పరీక్ష యంత్రాలను అందజేశారు. అలాగే ఇస్లాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 50 లీటర్ల వాటర్ ఫిల్టర్‌ను బహూకరించారు.

ఈ సందర్భంగా భారత్ పెట్రోలియం ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వృద్ధాశ్రయంలోని వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి ఆనందంగా గడిపారు.

కార్యక్రమంలో వృద్ధాశ్రయం అధ్యక్షుడు డాక్టర్ నర్ర గోపాల్‌రెడ్డి, జి. వినోద్‌రెడ్డి, జె. వెంకట్‌రెడ్డి, హెచ్‌ఎం వెంకట్, భారత్ పెట్రోలియం మేనేజర్ రామ్‌కుమార్, ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు, రాజీవ్, పాండు, భార్గవ్, ఉదయ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్‌చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ

Article Image

భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పైప్‌లైన్ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న సాయి చైతన్య సంక్షేమ వృద్ధాశ్రయానికి ఆర్థిక సాయం అందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రయానికి ఐదు వీల్‌చైర్లు, పది బెడ్‌షీట్లు, పది బెడ్లు, నాలుగు బీపీ–షుగర్ పరీక్ష యంత్రాలను అందజేశారు. అలాగే ఇస్లాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 50 లీటర్ల వాటర్ ఫిల్టర్‌ను బహూకరించారు.

ఈ సందర్భంగా భారత్ పెట్రోలియం ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వృద్ధాశ్రయంలోని వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి ఆనందంగా గడిపారు.

కార్యక్రమంలో వృద్ధాశ్రయం అధ్యక్షుడు డాక్టర్ నర్ర గోపాల్‌రెడ్డి, జి. వినోద్‌రెడ్డి, జె. వెంకట్‌రెడ్డి, హెచ్‌ఎం వెంకట్, భారత్ పెట్రోలియం మేనేజర్ రామ్‌కుమార్, ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు, రాజీవ్, పాండు, భార్గవ్, ఉదయ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News