Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

చౌటుప్పల్‌లో హరిత హారం.. తిరుమల వెంచర్‌లో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ ​

14-07-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. 2026-27 వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు తిరుమల వెంచర్‌లో మంగళవారం భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.​మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సూక్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.​ఈ కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, పర్యావరణ గీతాలు పాడుతూ మొక్కలు నాటారు. తాము నాటిన ప్రతి మొక్కను కంటికి రెప్పలా సంరక్షిస్తామని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడం విశేషం. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను బతికించే బాధ్యతను కాలనీవాసులు ఒక కర్తవ్యంగా చేపట్టాలని కోరారు.​కాలనీ వార్డు ఆఫీస్ ప్రాంగణంలో నీడను, పూలను ఇచ్చే వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, తిరుమల టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు మేడి రాములు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఊదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలే శ్రీలత చిరంజీవి, బద్రి గాలయ్య, దేపా రమ్య రాజు, పాక చిరంజీవి, గడ్డం ఇందిర రాజరత్నం, చింతల ఉమా మహేశ్వరి సాయిలు, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, హన్ను మహమ్మద్‌, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారాములు, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నబీబి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో హరిత హారం.. తిరుమల వెంచర్‌లో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ ​

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News