Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

పాముకాటు బాధిత నిరుపేద యువకుడికి అండగా గొప్ప లింగా రెడ్డి

14-07-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- వైద్య ఖర్చులకు రూ.5 వేల ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ గువ్వ రమేశ్ కుమారుడు గువ్వ శ్రీధర్ (సిద్ధులు) ఇటీవల పాముకాటుకు గురై లక్ష్మక్కపల్లి ఆర్‌వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న విజయ ఫార్మ్ అధినేత, తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్ప లింగా రెడ్డి మంగళవారం ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న లింగా రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తూ మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో దత్తాయపల్లి సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్,తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,ఓబీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవరుప్పల మల్లేశ్,గ్రామ శాఖ అధ్యక్షుడు,వార్డు సభ్యులు ధ్యానబోయిన నవీన్ ముదిరాజ్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి గొప్ప కొండల్ రెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు తొలిచుక్క బలరాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాముకాటు బాధిత నిరుపేద యువకుడికి అండగా గొప్ప లింగా రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News