Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్‌రావు

14-07-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగిస్తూ కార్మికులు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకుడు ఉజ్జిని రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు.

రామన్నపేట సివిల్ సప్లై గోదాం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన నరసింహ సంతాప సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. నరసింహ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేసిన ఉద్యమ నాయకుడని కొనియాడారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కార్మిక వర్గానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బత్తుల సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ ఇమ్రాన్, పిల్లి శంకర్, పల్లె శ్రీనివాస్, ఉట్కురి నరసింహ, ఎర్ర రమేష్, రచ్చ యాదగిరి తదితర నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్‌రావు

Article Image

రామన్నపేట,

కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగిస్తూ కార్మికులు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకుడు ఉజ్జిని రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు.

రామన్నపేట సివిల్ సప్లై గోదాం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన నరసింహ సంతాప సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. నరసింహ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేసిన ఉద్యమ నాయకుడని కొనియాడారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కార్మిక వర్గానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బత్తుల సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ ఇమ్రాన్, పిల్లి శంకర్, పల్లె శ్రీనివాస్, ఉట్కురి నరసింహ, ఎర్ర రమేష్, రచ్చ యాదగిరి తదితర నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News