Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

సహకార సంఘాలను కాపాడుకోవాలి చేనేత కార్మికుల అభివృద్ధికి సహకార సంఘాలే అండ – అధ్యక్షులు సంగిశెట్టి సుదర్శన్

14-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చేనేత సహకార సంఘాలు బలోపేతంగా ఉంటేనే చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత సాధ్యమవుతుందని శ్రీ మార్కండేయ సిల్క్ చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం జనంపల్లి అధ్యక్షులు సంగిశెట్టి సుదర్శన్ అన్నారు. ప్రతి చేనేత వృత్తిదారుడు సహకార సంఘాలను పరిరక్షించి, అభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

మండలంలోని జనంపల్లి చేనేత సహకార సంఘంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులుగా సంగిశెట్టి సుదర్శన్, ఉపాధ్యక్షులుగా సంగిశెట్టి విజయలక్ష్మి, కార్యదర్శిగా వనం శంకర్, కోశాధికారిగా పున్న శ్రీధర్, డైరెక్టర్లుగా కర్ణాటక రమేష్, కైరంకొండ బిక్షం, సంగిశెట్టి గణేష్, సంగిశెట్టి కళమ్మ, సూరపల్లి మహాలక్ష్మిలు ప్రమాణ స్వీకారం చేశారు.

కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, చేనేత వృత్తిదారులు, కార్మికులు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సహకార సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

సహకార సంఘాలను కాపాడుకోవాలి చేనేత కార్మికుల అభివృద్ధికి సహకార సంఘాలే అండ – అధ్యక్షులు సంగిశెట్టి సుదర్శన్

Article Image

చేనేత సహకార సంఘాలు బలోపేతంగా ఉంటేనే చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత సాధ్యమవుతుందని శ్రీ మార్కండేయ సిల్క్ చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం జనంపల్లి అధ్యక్షులు సంగిశెట్టి సుదర్శన్ అన్నారు. ప్రతి చేనేత వృత్తిదారుడు సహకార సంఘాలను పరిరక్షించి, అభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

మండలంలోని జనంపల్లి చేనేత సహకార సంఘంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులుగా సంగిశెట్టి సుదర్శన్, ఉపాధ్యక్షులుగా సంగిశెట్టి విజయలక్ష్మి, కార్యదర్శిగా వనం శంకర్, కోశాధికారిగా పున్న శ్రీధర్, డైరెక్టర్లుగా కర్ణాటక రమేష్, కైరంకొండ బిక్షం, సంగిశెట్టి గణేష్, సంగిశెట్టి కళమ్మ, సూరపల్లి మహాలక్ష్మిలు ప్రమాణ స్వీకారం చేశారు.

కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, చేనేత వృత్తిదారులు, కార్మికులు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సహకార సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News