Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ. ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచన

14-07-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని హరిజనవాడ కాలనీలో ఎన్నికల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా కాలనీవాసులు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సంబంధిత అధికారులకు మంగళవారం సమర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను ఎన్నికల శాఖ సీనియర్ అసిస్టెంట్ రమావత్ వినీతాబాయి, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) మేడి లలితకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ వివరాలు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవాలని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొడ్డు సాలయ్య, సురేందర్ రావు, గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ నకిరేకంటి రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ. ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచన

Article Image

రామన్నపేట మండలంలోని హరిజనవాడ కాలనీలో ఎన్నికల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా కాలనీవాసులు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సంబంధిత అధికారులకు మంగళవారం సమర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను ఎన్నికల శాఖ సీనియర్ అసిస్టెంట్ రమావత్ వినీతాబాయి, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) మేడి లలితకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ వివరాలు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవాలని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొడ్డు సాలయ్య, సురేందర్ రావు, గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ నకిరేకంటి రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News