Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచలేరు: ఎస్‌ఎఫ్‌ఐ

14-07-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. 'చలో సచివాలయం' కార్యక్రమానికి బయలుదేరుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ముందస్తు అరెస్టులను కమిటీ తీవ్రంగా ఖండించింది.​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల జీతాలకు నిధులు కరువవ్వడం లేదు కానీ, పేద విద్యార్థుల చదువుల కోసం ఇచ్చే స్కాలర్‌షిప్‌లకే బడ్జెట్ కొరత వచ్చిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీజుల బకాయిల వల్ల కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, పెండింగ్ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులలో ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు దాసరి ప్రకాష్, తిగుళ్ళ శ్రీనివాస్‌, మండల సహాయ కార్యదర్శి సావిత్రి మనోజ్ కుమార్, మండల కమిటీ సభ్యుడు పోలేపల్లి మల్లేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Sthanikam

అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచలేరు: ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News