Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:20 AM

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన
14-07-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ యాడవెందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, సిగ్నల్ జంపింగ్ చేయవద్దని సూచించారు.

అలాగే ఆటోలలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News