Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

ఓటు హక్కును కాపాడుకుందాం. ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి: కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుండాల సతీష్

14-07-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపట

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమైనదని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుండాల సతీష్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై మంగళవారం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేందుకేనని పేర్కొన్నారు.

మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఉన్నా ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియను పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని గుండాల సతీష్ కోరారు.

Sthanikam

ఓటు హక్కును కాపాడుకుందాం. ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి: కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుండాల సతీష్

Article Image

రామన్నపట

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమైనదని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుండాల సతీష్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై మంగళవారం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేందుకేనని పేర్కొన్నారు.

మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఉన్నా ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియను పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని గుండాల సతీష్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News