Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:16 AM

పీఆర్సీ ఎక్కడ..? డీఏలు ఎప్పుడు..? ఉపాధ్యాయుల సమస్యలపై తపస్ ఫైర్

14-07-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి జిల్లా ధర్నాలో కానుగంటి హనుమంతరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి

రంగారెడ్డి,

ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు మండిపడ్డారు. పీఆర్సీ ప్రకటించకుండా, ఆరు డీఏలను పెండింగ్‌లో ఉంచి, బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తపస్ జిల్లా ధర్నాలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి కానుగంటి హనుమంతరావు, టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేసి 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన అన్ని బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఫీజు బిల్లులు, వైద్య రీయింబర్స్‌మెంట్, పెన్షన్ బెనిఫిట్స్, కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు, మహిళా ఉపాధ్యాయుల సమ్మె కాలపు వేతనాలు, మోడల్ స్కూల్స్ అంశం, జీఓ–190 అమలు, 2003 డీఎస్సీ అభ్యర్థులకు ఓపీఎస్ అమలు, సీపీఎస్ రద్దు, 2008 డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ వంటి అన్ని సమస్యలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయుల బదిలీలు–పదోన్నతుల వార్షిక క్యాలెండర్ విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

"ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా చేపడతాం" అని హెచ్చరించారు.

ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశిరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేష్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరికృష్ణ, యుగంధర్ రెడ్డి, సురధీర్, రాజిరెడ్డి, మహేశ్ కుమార్, మహిళా కన్వీనర్ సుమ రంజిత, జిల్లా, మండల నాయకులు, సుమారు 130 మంది తపస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పీఆర్సీ ఎక్కడ..? డీఏలు ఎప్పుడు..? ఉపాధ్యాయుల సమస్యలపై తపస్ ఫైర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News