Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్

14-07-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 14:

చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. రహదారిని ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారనే అంశంపై అధికార యంత్రాంగం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

రహదారి విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించకపోవడంతో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యాపారులు, భవన యజమానులు, స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని నాయకులు పేర్కొన్నారు. విస్తరణ పనుల పరిధి, భూ సేకరణ అవసరం, ప్రభావిత నిర్మాణాల వివరాలు వంటి అంశాలను బహిర్గతం చేసి అపోహలకు తెరదించాలని కోరారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాట్లాడుతూ, ప్రజలకు ముందస్తు సమాచారం అందించకుండా చేపట్టే చర్యలు ఇబ్బందులకు దారితీసే అవకాశముందని అన్నారు. రహదారి విస్తరణను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్.కె. షబానా అజీముద్దీన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, కందాటి రమేష్ రెడ్డి, రుద్రారపు కృష్ణ, ఆగు అశోక్, మారగోని రమేష్, బొలుగురి సైదులు, ఆవుల ఆనంద్, జిట్టా కృష్ణ, ఉప్పలపల్లి నగేష్, జిట్టా శేఖర్, కునూరు శంకర్, చేపూరి శ్రీనివాస్, సుంచు సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News