Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవ చాటిన బైండ్ల కృష్ణ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 08:49 PM

ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.  ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
July 14, 2026 07:08 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు.


రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కూరెళ్ల నర్సింహాచారి అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేయడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోందని విమర్శించారు.


ప్రతి ఏడాది లక్షలాది మంది యువత చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా, కేంద్రం, రాష్ట్రం తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం, నోటిఫికేషన్ల విడుదలలో ఆలస్యం, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు.


ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సీపీఎం మహాధర్నాకు నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు జంపాల అండాలు, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు ఆవనగంటి నగేష్, గన్నేబోయిన విజయభాస్కర్, గొరిగే సోములు, నాగటి ఉపేందర్, బొడిగే రజిత, తొలుపునూరి శ్రీనివాస్, శాఖ కార్యదర్శులు మునికుంట్ల లెనిన్, తాళ్లపల్లి జితేందర్, శానగొండ వెంకటేశ్వర్లు, గోగు లింగస్వామి, జోగుల ధనలక్ష్మి, కొమ్ము అంజమ్మ, నాగటి లక్ష్మణ్, అప్పం సురేందర్, ఆముద ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News