Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రి-సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 10:49 PM

భువనగిరి పట్టణలో ప్రజా బాట కార్యక్రమం

భువనగిరి పట్టణలో ప్రజా బాట కార్యక్రమం

భువనగిరి పట్టణలో ప్రజా బాట కార్యక్రమం
July 14, 2026 09:23 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లు ఏర్పాటు చేస్తాం:భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సహకారంతో,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 1,2,7,15,16, 34వ వార్డులలో (వాక్ ఆన్ లైన్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ విద్యుత్ అధికారులతో కలిసి పలు వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా వంగిపోయిన,పాడైపోయిన విద్యుత్ స్తంభాలు,పాత ట్రాన్స్ఫార్మర్లు మరియు శిథిలావస్థలో ఉన్న విద్యుత్ లైన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానికులు చైర్మన్ కు వినతి పత్రం అందజేస్తూ,వంగిపోయిన మరియు పాడైపోయిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను,పాత ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను,అలాగే పాత లైన్ల స్థానంలో కొత్త విద్యుత్ లైన్లను వెంటనే నూతనంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల వినతులపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి మాట్లాడుతూ,"ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వంగిన స్తంభాలు,పాత ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి,పాత స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు,పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లు మరియు కొత్త స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది"అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని,ప్రతి వార్డులోని సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామని చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్.ఈ కె.సురేష్,డిఈ.సంఘం వెంకటేశ్వర్లు, ఏడిఈ.పానుగంటి రవీంద్ర చారి,భువనగిరి టౌన్ ఏడిఈ.సాయి కృష్ణ,భువనగిరి రూరల్ ఏడిఈ.వెంకటేశ్వర్లు,విద్యుత్ శాఖ భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు

ఏలే భువనేశ్వరి,పోలిశెట్టి అనిల్ కుమార్,కుక్కతో పద్మావతి,బొజ్జయిని శారద,చెన్నా స్వాతి,సరిగడ రాజ్యలక్ష్మి, నాజియా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News