Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్

28-07-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మాజీ అధ్యక్షుడు మర్రి రమేష్ అన్నారు.ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ నమోదు, పని ప్రదేశాల పర్యవేక్షణతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లు, హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్‌లో ఉన్న మూడు నెలల గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేసి ఉపాధి హామీ సిబ్బందిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మర్రి రమేష్ డిమాండ్ చేశారు.

Sthanikam

ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్

Article Image

చిట్యాల: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మాజీ అధ్యక్షుడు మర్రి రమేష్ అన్నారు.ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ నమోదు, పని ప్రదేశాల పర్యవేక్షణతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లు, హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్‌లో ఉన్న మూడు నెలల గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేసి ఉపాధి హామీ సిబ్బందిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మర్రి రమేష్ డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News