సంగారెడ్డిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు
సంగారెడ్డిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు
Krishna
సంగారెడ్డి పట్టణంలో నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఐబీ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు అస్తబల్ వరకు సంప్రదాయబద్ధంగా కొనసాగింది. డప్పు చప్పుళ్లు, భక్తి గీతాలు, పోతరాజుల విన్యాసాలు, మహిళలు తలపై బోనాలతో పాల్గొనడంతో పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి పాల్గొని శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని చిందులు వేస్తూ సందడి చేశారు. కార్యక్రమం సందర్భంగా నిర్వాహకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రజలందరికీ అమ్మవారి కటాక్షం లభించి ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాసిని శ్రీకాంత్, రవి, అక్షయ్, అఖిల్, నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి