Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

డ్రగ్స్‌కు 'నో' చెప్పండి.. జీవితానికి 'యెస్' చెప్పండి.ఎస్ ఐ గోపాతి సతీష్

28-07-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పోలీసుల విస్తృత అవగాహన.

డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు.

రామన్నపేట, జూలై 28

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని రామన్నపేట ఎస్‌ఐ గోపాతి సతీష్ పిలుపునిచ్చారు.

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో మంగళవారం రామన్నపేటలో మాదకద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. "Say No to Drugs – Say Yes to Life" అనే నినాదాలతో బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను, సమాజాన్ని, యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, అలాంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 8712671111 వాట్సాప్ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తూ, వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అదే సమయంలో వాహనాల పత్రాలను పరిశీలిస్తూ ప్రత్యేక వెహికల్ చెకింగ్ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ స్పష్టం చేశారు.

డ్రగ్స్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి సామాజిక రుగ్మతలను అరికట్టడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ గోపాతి సతీష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, పిసి స్వామి నాయక్, రాఘవేంద్ర, ఎస్జి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌కు 'నో' చెప్పండి.. జీవితానికి 'యెస్' చెప్పండి.ఎస్ ఐ గోపాతి సతీష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News