Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

పీఆర్సీ ప్రకటించాలి.. సీపీఎస్ రద్దు చేయాలి ఆగస్టు 1 రాష్ట్ర మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలి: తపస్ నేత పూజారి రమేశ్

28-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాడుగుల, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించి, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల తపస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఆగస్టు 1న నిర్వహించనున్న రాష్ట్ర మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం పెండింగ్ పీఆర్సీని ప్రకటించడంతో పాటు ఆరు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జే. కరుణాకర్ రెడ్డి, జిల్లా బాధ్యులు పున్న రమేష్, మండల అధ్యక్షుడు ఆకుల శేఖర్, ప్రధాన కార్యదర్శి కాలే కృష్ణ, సహాధ్యక్షులు చీర వెంకటేష్, శ్రీధర్ గౌడ్, ఎం. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పీఆర్సీ ప్రకటించాలి.. సీపీఎస్ రద్దు చేయాలి ఆగస్టు 1 రాష్ట్ర మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలి: తపస్ నేత పూజారి రమేశ్

Article Image

మాడుగుల, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించి, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల తపస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఆగస్టు 1న నిర్వహించనున్న రాష్ట్ర మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం పెండింగ్ పీఆర్సీని ప్రకటించడంతో పాటు ఆరు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జే. కరుణాకర్ రెడ్డి, జిల్లా బాధ్యులు పున్న రమేష్, మండల అధ్యక్షుడు ఆకుల శేఖర్, ప్రధాన కార్యదర్శి కాలే కృష్ణ, సహాధ్యక్షులు చీర వెంకటేష్, శ్రీధర్ గౌడ్, ఎం. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News