మంచాల:
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి మరో ముందడుగు వేస్తూ BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచాల పోలీస్ స్టేషన్ సిబ్బందికి జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, జూట్ బ్యాగుల వాడకాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ రహిత సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల సీఐ మధు, అశ్వల బాలరాజు, రావుల శంకర్, దాచిరెడ్డి అమర్నాథ్, గూడె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి