Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమాల విజయమే: డివైఎఫ్ఐ.

28-07-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిపర్తి, జూలై 28

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాల విజయమని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ అన్నారు. మంగళవారం తిపర్తిలో నిర్వహించిన డివైఎఫ్ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీట్‌తో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో జరిగిన పేపర్ లీక్‌లు, అవకతవకలతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం విద్యార్థుల పోరాటానికి లభించిన విజయమని అన్నారు.

దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐతో పాటు ప్రజాస్వామ్య శక్తులు చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని తెలిపారు. భవిష్యత్తులో పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో డివైఎఫ్ఐ తిపర్తి మండల కార్యదర్శి పోకల శశిధర్, మండల అధ్యక్షుడు లింగరాజు, శంకర్, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమాల విజయమే: డివైఎఫ్ఐ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News