Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

చౌటుప్పల్‌లో కోతుల బెడదకు చెక్! ​

చౌటుప్పల్‌లో కోతుల బెడదకు చెక్! ​

చౌటుప్పల్‌లో కోతుల బెడదకు చెక్! ​
18-07-2026 221 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా తీవ్రంగా ఉన్న కోతుల బెడద నివారణకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి నిపుణుల బృందాన్ని రప్పించారు. శనివారం పట్టణంలోని విద్యానగర్, కచ్చీరు తదితర ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి సుమారు 211 కోతులను బంధించారు. ​చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు పట్టుబడిన కోతులను ములుగు జిల్లాలోని మాటు కొండూరు అటవీ ప్రాంతానికి తరలించారు. పట్టణ ప్రజల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యతని, ఈ డ్రైవ్ మున్సిపాలిటీ అంతటా కొనసాగుతుందని చైర్‌పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాక చిరంజీవి, హన్ను మహమ్మద్, బద్రి గాలయ్య, చింతల ఉమామహేశ్వరి, నాయకులు చింతల సాయిలు, బత్తుల దాసు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని కోతుల బెడద నుండి ఉపశమనం కలిగించినందుకు పట్టణ ప్రజలు పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో కోతుల బెడదకు చెక్! ​

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News