Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:17 AM

ఆరోగ్యమే ఆస్తి.. ఆరోగ్యమే ఆనందం: ఇబ్రహీంపట్నం, యాచారంలో భారీ ఉచిత వైద్య శిబిరాలు

18-07-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇబ్రహీంపట్నం,

గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బిఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత బూడిద రామిరెడ్డి ఆధ్వర్యంలో, సాయి కీర్తన్ రెడ్డి లెగసీ ట్రస్ట్ సహకారంతో శనివారం ఇబ్రహీంపట్నం భారత్ గార్డెన్‌తో పాటు యాచారం మండల కేంద్రంలో భారీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు న్యూరాలజీ, ఆర్థోపెడిక్, కంటి, స్త్రీల ఆరోగ్యం, చిన్నారుల వైద్యం, జనరల్ సర్జరీ విభాగాల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ వినయ్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు ఇచ్చాయి.

సంగం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 98 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇబ్రహీంపట్నంలో 580 మంది, యాచారంలో 420 మంది కలిపి మొత్తం 1,000 మంది వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య సేవలు పొందారు.

ఈ సందర్భంగా బూడిద రామిరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప్పరగూడెం సర్పంచ్ వేణి నందకుమార్, బిఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు నరసింహారెడ్డి, మనీష్ రెడ్డి, మంగ ఐలేష్, గొరిగే రమేష్, సద్దాం హుస్సేన్, చెరుకూరి రవీందర్, శేఖర్ యాదవ్, అశ్వాల బాలరాజ్, రావుల శంకర్, కావలి వెంకటేష్, శ్రావణ్, శ్రీనివాస్, ఇర్లపల్లి నరేందర్, సామల శ్రీనివాస్ రెడ్డి, దర్గా నవీన్ ముద్రాజ్, మొగిలి మహేష్, తలారి రాజు, కొండ్రు వెంకటేష్, సంజీవ, శ్రీను, తాళ్లపల్లి గూడెం సర్పంచ్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యమే ఆస్తి.. ఆరోగ్యమే ఆనందం: ఇబ్రహీంపట్నం, యాచారంలో భారీ ఉచిత వైద్య శిబిరాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News