Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:09 PM

భూ వివాదాలకు చెక్..! నిధానపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం

18-07-2026 203 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆధునిక సాంకేతికతతో భూ సరిహద్దుల నిర్ధారణ..

రామన్నపేట నిదానపల్లి

భూ రికార్డుల్లో పారదర్శకత, భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో శనివారం ప్రారంభమైంది. మండల తహసీల్దార్ లాల్ బహదూర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, పారదర్శకమైన భూ రికార్డులను రూపొందించడమే రీ-సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రీ-సర్వే పూర్తయితే భూ వివాదాలకు తెరపడటంతో పాటు ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కుల నమోదు జరిగే అవకాశముందని పేర్కొన్నారు.

రైతులు, భూ యజమానులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు తదితర భూ పత్రాలతో సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. సర్వే అనంతరం ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నిర్ణీత గడువులో సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఖచ్చితమైన, పారదర్శకమైన భూ రికార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది శోభ, వెంకటేశ్వర్లు, స్వప్న, లక్ష్మీదేవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుత్తా నర్సిరెడ్డి, సింగిరెడ్డి మల్లారెడ్డి, రామన్నపేట పోలీసు సిబ్బంది, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు బాషమల్ల అనిత, సంతోష్, వంగాల పూజిత, ఏకుల మల్లేష్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

భూ వివాదాలకు చెక్..! నిధానపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News