Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:23 AM

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరం.జనంపల్లి జెడ్పీహెచ్ఎస్‌లో న్యాయ సేవల సంస్థ ప్రత్యేక సదస్సు

18-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, విద్యార్థులు విద్యతో పాటు చట్టాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష సూచించారు. మండలంలోని జనంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామన్నపేట మండల న్యాయ సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి ఎస్. శిరీష మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ ద్వారానే ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంటుందని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.

విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల నివారణ వంటి అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పాఠశాలలో లేదా పాఠశాలకు వచ్చే, వెళ్లే మార్గంలో ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే పాఠశాలలోని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌కు, స్థానిక పోలీసులకు లేదా మండల న్యాయ సేవల అధికార సంస్థకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించాలని, మంచి నిర్ణయాలు తీసుకునేలా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని అన్నారు. సమాజం పట్ల అవగాహన పెంచుకుని హక్కులు, బాధ్యతలను తెలుసుకుంటూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అడ్వకేట్లు బర్ల డేవిడ్, మామిడి వెంకట్‌రెడ్డి, ఎన్. రమేష్, ప్రధానోపాధ్యాయురాలు కె. విజయమాధవి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మట్టారెడ్డి, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరం.జనంపల్లి జెడ్పీహెచ్ఎస్‌లో న్యాయ సేవల సంస్థ ప్రత్యేక సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News