Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:51 AM

ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

18-07-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, మొక్కలు నాటిన సుర్వి యాదయ్య గౌడ్

ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ పరిధిలోని ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో పయనించాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన జగదీశ్వర్ రెడ్డి తిరిగి మంత్రి పదవి చేపట్టి జిల్లాను మరింత ముందుకు నడిపించాలని ఆ మైసమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. జగదీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మల్కాపురం గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్, ధర్మాజీగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు సింహాద్రి, గుడిమల్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధగోని శ్రీనివాస్, మండల ప్రముఖ నాయకులు గుండు లింగన్న గౌడ్, సుర్వి లింగస్వామి గౌడ్, కత్తుల సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News