జూలై 22న తల్లీకి వందనం నిధులు విడుదల
జూలై 22న తల్లీకి వందనం నిధులు విడుదల
Anjali
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "తల్లీకి వందనం" పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూలై 22వ తేదీన ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులలో బ్యాంక్ ఖాతా లేనివారు లేదా NPCI సీడింగ్ పెండింగ్ ఉన్నవారు వెంటనే ఆయా ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎం.శ్రీరాములు ఒక ప్రకటనలో కోరారు.బ్యాంక్ ఖాతా లేని విద్యార్థుల సౌకర్యార్థం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లో కేవలం రూ. 200/- లతో కొత్త ఖాతా ప్రారంభించుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించడం జరిగింది.
ఖాతా ప్రారంభానికి కావలసిన పత్రాలు..
ఆధార్ కార్డు,10వ తరగతి మార్కుల మెమో లేదా జన్మదిన ధృవీకరణ పత్రం (DOB Proof)
ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్ నంబర్ (ఓటీపీ కొరకు)రూ. 200/- ఖాతా ప్రారంభ రుసుము,మైనర్ విద్యార్థుల కొరకు: 18 సంవత్సరాల లోపు వయసున్న మైనర్ విద్యార్థులైతే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ మరియు బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయవచ్చు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ చొరవ తీసుకుని, తమ కళాశాలలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులందరినీ గుర్తించి, అవసరమైన పత్రాలతో సమీప పోస్ట్ ఆఫీస్ నందు ఖాతాలు తెరిపించాలని కోరడమైనది. జూలై 22న నిధులు విడుదల కానున్నందున, పెండింగ్ బ్యాంక్ ఖాతాలు మరియు NPCI ప్రక్రియను 100% అత్యవసరంగా పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి