Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:42 AM

వర్షాకాల వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కమిషనర్ ప్రశాంతి

17-07-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఫ్రైడే–డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 1వ వార్డులో మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, కూలర్లు, డ్రమ్‌లు, పాత టైర్లు, కుండీలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా తరచూ శుభ్రం చేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి వర్షాకాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్రవారం ఫ్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని పాటిస్తూ పరిశుభ్రమైన పరిసరాల కోసం సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వర్షాకాల వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కమిషనర్ ప్రశాంతి

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఫ్రైడే–డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 1వ వార్డులో మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, కూలర్లు, డ్రమ్‌లు, పాత టైర్లు, కుండీలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా తరచూ శుభ్రం చేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి వర్షాకాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్రవారం ఫ్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని పాటిస్తూ పరిశుభ్రమైన పరిసరాల కోసం సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News