Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:38 AM

డిగ్రీ ప్రవేశాలకు చివరి ఛాన్స్..!ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్.

17-07-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా మరో అవకాశం లభించింది. రామన్నపేటలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో ఇంకా కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

ఇప్పటి వరకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోని విద్యార్థులతో పాటు ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో సీట్లు పొందని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దోస్త్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జూలై 27న, సీట్ల కేటాయింపు జూలై 30న ఉంటుందని తెలిపారు. అదే రోజు నుంచి విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. స్పెషల్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

డిగ్రీలో చేరేందుకు ఇది చివరి అవకాశమని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9989897566, 9985824737 నంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.

Sthanikam

డిగ్రీ ప్రవేశాలకు చివరి ఛాన్స్..!ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News