ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని మానూర్ మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ తెలిపారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) గడువు ఆగస్టు 3, 2026 వరకు పొడిగించబడినందున, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవడం లేదా వివరాలను సవరించుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని పిలుపునిస్తూ, మన ఓటు – మన భవిష్యత్తు, మన బాధ్యత అని మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ పేర్కొన్నారు.
PRINT TIME: September 08, 2026 07:39 AM
మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్

17-07-2026
52 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని మానూర్ మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ తెలిపారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) గడువు ఆగస్టు 3, 2026 వరకు పొడిగించబడినందున, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవడం లేదా వివరాలను సవరించుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని పిలుపునిస్తూ, మన ఓటు – మన భవిష్యత్తు, మన బాధ్యత అని మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి