Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:44 AM

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి!

17-07-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేశం

ట్రినిటీ హైస్కూల్‌లో రోడ్డు భద్రతా సదస్సు

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలకు రక్షణ ఉంటుందని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేశం అన్నారు. పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్‌లో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని, ఇంట్లోని పెద్దలకు కూడా వీటిని వివరించాలని కోరారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని, మొబైల్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు. మలుపుల వద్ద ఇండికేటర్లు వాడాలని, నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలపవద్దన్నారు. అనంతరం విద్యార్థులతో ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. ​ఈ సందర్భంగా సీఐ నందగిరి వెంకటేశంను స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హై స్కూల్ చైర్మన్ కే వి బి కృష్ణారావు, ప్రిన్సిపాల్ కం డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ట్రాఫిక్ ఎస్ఐ జి సైదిరెడ్డి, ఆర్ ఎస్ ఐ ఆంజనేయులు, ఏఎస్ఐ జంగయ్య, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News