Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం.. నీట్‌లో తొలి అర్హత సాధించిన గాజులుపాడ్ విద్యార్థి భారత్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 06:50 PM

చదువుతో పాటు న్యాయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య

చదువుతో పాటు న్యాయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య

చదువుతో పాటు న్యాయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి.  సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య
July 17, 2026 04:43 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

విద్యార్థులు విద్యలో రాణించడమే కాకుండా చట్టాలపై అవగాహన పెంచుకుని సమాజానికి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య అన్నారు. రామన్నపేట మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రతి విద్యార్థి విద్యాహక్కు చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాజంలో జరిగే చట్టవిరుద్ధ ఘటనలను చూసి మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి సారిస్తేనే ఉన్నత లక్ష్యాలను సాధించగలరని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థానిక పోలీస్ స్టేషన్ లేదా మండల న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు.

ఈ సందర్భంగా ఏజీపీ సుక్క శ్రావణ్ మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహనతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన ఉంటేనే నేరాలు, దురాచారాలను అరికట్టడంలో యువత కీలక పాత్ర పోషించగలరని అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News