Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:09 AM

రాత్రి గస్తీకి మరింత పటిష్టం పోలీసులకు అత్యాధునిక రక్షణ సామగ్రి...

17-07-2026 222 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

 రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్ఈడీ బ్యాటన్లు, ఫైబర్ లాఠీలు పంపిణీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్...

నేరాల నియంత్రణే లక్ష్యం విధి నిర్వహణలో సిబ్బంది భద్రతకూ ప్రాధాన్యత...

నల్గొండ జిల్లాలో రాత్రి వేళల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీస్ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నైట్ బీట్ (రాత్రి గస్తీ) వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాత్రి గస్తీ నిర్వహించే పోలీసు సిబ్బందికి ప్రత్యేక రక్షణ సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్ఈడీ బ్యాటన్లు, ఫైబర్ లాఠీలను సిబ్బందికి అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో నైట్ బీట్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, చీకటి వీధులు, జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు నిర్మానుష ప్రాంతాలలో నిరంతరం అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు.

సిబ్బంది భద్రతే ముఖ్యం..

​విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది భద్రత కూడా అంతే ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. రాత్రి గస్తి నిర్వహించే పోలీసులకు రిఫ్లెక్టివ్ జాకెట్ల పంపిణిచేసి రాత్రి వేళల్లో వాహనదారులకు పోలీసులు స్పష్టంగా కనిపించేందుకు ఇవి ఉపయోగపడతాయని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. ఎల్ఈడీ బ్యాటన్లు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల తనిఖీలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో హెచ్చరిక సంకేతాలు ఇవ్వడానికి ఇవి దోహదపడతాయి. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, అవసరమైన సమయాల్లో ఆత్మరక్షణకు, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఫైబర్ లాఠీలు ఉపయోగపడతాయని వివరించారు.

సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా..

​ప్రతి నైట్ బీట్ అధికారి తమ పరిధిలోని బ్యాంకులు, ఏటీఎంలు, బంగారు ఆభరణాల దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఒంటరి ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే తనిఖీలు చేపట్టాలని, అవసరమైతే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు కాకుండా ముందస్తుగా అరికట్టాలని సూచించారు. పోలీసులపై ప్రజల్లో భద్రతాభావం, విశ్వాసం పెంపొందేలా సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కావాల్సిన వారికి తక్షణమే స్పందించాలి. ఆధునిక సాంకేతిక పరికరాలు, భద్రతా సామగ్రిని అందుబాటులోకి తెచ్చి జిల్లా పోలీసింగ్‌ను మరింత ఆధునికీకరిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు సంతోష్, శ్రీను మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రాత్రి గస్తీకి మరింత పటిష్టం పోలీసులకు అత్యాధునిక రక్షణ సామగ్రి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News