Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:42 AM

ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 15.13 లక్షలు

17-07-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

144 రోజులకు గాను భక్తుల కానుకలు

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పర్యవేక్షణలో లెక్కింపు

చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థాన హుండీ కానుకలను శుక్రవారం అధికారులు లెక్కించారు. నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (ఏసీ) పర్యవేక్షణ అధికారి కె. భాస్కర్ ఆధ్వర్యంలో దేవస్థాన ప్రాంగణంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు చేపట్టారు. ​గడిచిన 144 రోజులకు గాను హుండీ ద్వారా ఆలయానికి రూ. 15,13,204 (పదిహేను లక్షల పదమూడు వేల రెండు వందల నాలుగు రూపాయలు) ఆదాయం సమకూరినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో నోట్ల రూపంలో రూ. 14,26,800 రాగా, నాణేల రూపంలో రూ. 86,404 వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, ధర్మకర్తలు జొన్నగంటి దాసు, డి. రాజేష్, డి. రాజీవ్, ఇ. బాబు, ఎస్. ఆనంద్ రెడ్డి, వి. శివ చారి, బి. నరసింహ, ఎం. మహేందర్ రెడ్డి, బి. యువరాజు, పి. రమేష్, బి. శ్రీకాంత్, సిహెచ్. సబిత, మీసాల నరసింహ, మల్కాపురం ఉపసర్పంచ్, గ్రామస్తులు వేలువర్తి యాదగిరి, ఈడుదుల మస్తాన్ బాబు, సిహెచ్. జంగయ్య, జంగారెడ్డి, శ్రీవారి సేవ సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 15.13 లక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News