Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:09 AM

కంది సెంట్రల్ జైలులో భద్రతపై ఎస్పీ ప్రత్యేక సమీక్ష.. కట్టుదిట్టమైన నిఘాకు కీలక ఆదేశాలు

17-07-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సందర్శించి జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జైలు ఆవరణ, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులను పరిశీలించిన ఆయన, ఖైదీల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత వస్తువులు జైలులోకి రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని, సందర్శకుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షిస్తూ, జైలు గోడలు, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని, సిబ్బందికి తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జైలు భద్రత విషయంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్‌తో పాటు జైలు అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

కంది సెంట్రల్ జైలులో భద్రతపై ఎస్పీ ప్రత్యేక సమీక్ష.. కట్టుదిట్టమైన నిఘాకు కీలక ఆదేశాలు

Article Image

సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సందర్శించి జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జైలు ఆవరణ, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులను పరిశీలించిన ఆయన, ఖైదీల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత వస్తువులు జైలులోకి రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని, సందర్శకుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షిస్తూ, జైలు గోడలు, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని, సిబ్బందికి తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జైలు భద్రత విషయంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్‌తో పాటు జైలు అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News