Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

చౌటుప్పల్‌లో ఓటరు అవగాహన ప్రచార రథాలు షురూ!

17-07-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

ఆగస్టు 3 వరకు ఇంటింటికీ బీఎల్‌ఓలు.. వివరాల సవరణకు సువర్ణావకాశం

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలో ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించడానికి, ఓటర్ల జాబితా సవరణపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - 2026" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రెండు ప్రచార ఆటోలను మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ గురువారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.​​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని ప్రతి వార్డులో జూన్ 25 నుండి ఆగస్టు 3, 2026 వరకు బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు) ప్రతి ఇంటికీ వచ్చి ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా వివరాలు సేకరిస్తారని తెలిపారు.18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి, అలాగే ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమని, ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.​మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, బద్రి గాలయ్య, పాక చిరంజీవి, పిల్లలమర్రి మధుసూదన్, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగా రాములు, మహమ్మద్ బాబా షరీఫ్, స్థానిక నాయకులు దేప రాజు, బత్తుల దాసు, చింతల సాయిలు,మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్.ఓ. అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ దీప, జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్, జె.ఎ.ఓ శ్రీనాథ్, మహేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఓటరు అవగాహన ప్రచార రథాలు షురూ!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News